టెస్టుల్లో అందరికీ నంబర్ వన్ ర్యాంక్!

Wed,August 15, 2018 04:11 PM

ICC ranks all batsmen as Number One for a Brief Time here is why

దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అందరికీ నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చింది. అయితే అది కొద్ది సేపు మాత్రమే. ఐసీసీ సరదాగా చేసిన పని ఇది. అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ చేసిన ట్వీట్ చూసి ఐసీసీ ఇలా అందరికీ నంబర్ వన్ ర్యాంక్ ఇవ్వడం విశేషం. ఎవరూ ఎవరి కంటే ఎక్కువ కారు అని కాన్యే వెస్ట్ ట్వీట్ చేశాడు. ఇది చూసి నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటామా అంటూ అందరికీ నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిన చార్ట్‌ను తన ట్విటర్‌లో ఐసీసీ పోస్ట్ చేసింది.
తర్వాత కొద్దిసేపటికే ర్యాంకులను ఐసీసీ మార్చేసినా.. అప్పటికే ఆ ట్వీట్ వైరల్‌గా మారిపోయింది. ఇంటర్నెట్‌లో ఐసీసీ ట్వీట్‌పై సరదాగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టెస్టుల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేయడంతో నంబర్‌వన్‌గా నిలిచాడు. అయితే రెండో టెస్ట్‌లో విఫలమవడంతో మళ్లీ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం స్మిత్ కంటే పది పాయింట్లు వెనుకబడిన కోహ్లి.. రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.


5467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS