ఇషాంత్‌ శర్మకు జరిమానా

Sat,August 4, 2018 08:31 PM

ICC fines Ishant Sharma for animated celebration of Dawid Malan

బర్మింగ్‌హోమ్: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మకు ఐసీసీ జరిమానా విధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇషాంత్ అనుచితంగా ప్రవర్తించడమే ఈ జరిమానాకు కారణం. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్‌ను ఔట్ చేసిన సమయంలో హద్దు దాటి సంబరాలు చేసుకున్నాడు. ఇషాంత్ అత్యుత్సాహాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ అతనికి శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1ను అతడు ఉల్లంఘించినందుకు అతనికి ఒక డీమెరిట్ పాయింట్, మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. మ్యాచ్ అనంతరం ఇషాంత్‌ను మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రౌ వివరణ కోరగా తాను తప్పు చేశానని, తనకు విధించిన జరిమానాను స్వీకరిస్తున్నట్లు అంగీకరించాడు. మూడో రోజు తొలి సెషన్‌లో డేవిడ్ మలన్ వికెట్ తీసిన తరువాత ఇషాంత్ సంబరాలు బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టేలా ఉందని మ్యాచ్ అధికారులు గుర్తించారని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. తొలి టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

5387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles