రిటైర్ అంటే రిటైరే.. ఐపీఎల్ కూడా ఆడను: నెహ్రా

Thu,October 12, 2017 03:14 PM

హైదరాబాద్: రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించాడు ఆశిష్ నెహ్రా. ఇది తన సొంత నిర్ణయమే అని, ఎవరి ఒత్తిడి లేదని స్పష్టంచేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20 కోసం టీమ్‌తోపాటు హైదరాబాద్ వచ్చిన నెహ్రా.. ఇవాళ మీడియాలో మాట్లాడాడు. ఢిల్లీలో నవంబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ చివరిది. సొంతగడ్డపై రిటైరవడం కంటే ఇంకా కావాల్సింది ఏముంటుంది అని నెహ్రా అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ మొదలయ్యే ముందే రిటైర్మెంట్ విషయాన్ని కోహ్లి, రవిశాస్త్రిలకు చెప్పాను. భువి, బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. నేను రిటైరవడానికి ఇదే సరైన సమయం అని వారితో అన్నట్లు నెహ్రా వెల్లడించాడు. మరి ఐపీఎల్ ఆడతారా అని ప్రశ్నించగా.. నేను ఒక్కసారి రిటైర్ అవ్వాలని అనుకుంటే ఇక అంతే.. ఐపీఎల్ కూడా ఆడను అని స్పష్టంచేశాడు. మరో రెండేళ్లు ఆడాలని అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. నా బాధంతా నా శరీరం గురించే. ఓ పేస్ బౌలర్‌గా 38 ఏళ్ల వయసులో శరీరం సహకరించదు. నాకు మరో రెండేళ్లు ఆడాలనే ఉన్నది. ఇప్పటికే నాకు సాధ్యమైనంత వరకు ఆడుతున్నా అని గతంలో నెహ్రా అన్నాడు.
3345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles