భార్య ప్రోత్సాహం వ‌ల్లే రాణించాను: డేవిడ్ వార్న‌ర్‌

Thu,June 13, 2019 10:48 AM

I thought i might never score a hundred for Australia again, says David Warner

హైద‌రాబాద్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ ఓ ఏడాది పాటు క్రికెట్‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ కేసులో స్టీవ్ స్మిత్‌తో పాటు వార్న‌ర్ కూడా ఏడాది కాలం పాటు ఆసీస్ జ‌ట్టుకు దూరం అయ్యాడు. నిషేధం ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ త‌న స‌త్తాను ఇటీవ‌ల ఐపీఎల్‌లో ప్ర‌ద‌ర్శించాడు. ఇక వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కీల‌క సెంచ‌రీ చేసి త‌న ట్యాలెంట్‌ను మ‌రోసారి చూపించాడు. కానీ నిషేధానికి గురైన మొద‌ట్లో వార్న‌ర్ చాలా నిర్వేదానికి గుర‌య్యాడు. మ‌ళ్లీ ఆస్ట్రేలియాకు ఆడుతానో లేదో అన్న సందేహాం అత‌నిలో ఉండేది. భార్య క్యాండిస్ ప్రోత్సాహం వ‌ల్లే మ‌ళ్లీ మేటి ప్లేయ‌ర్‌గా రాణించిన‌ట్లు వార్న‌ర్ చెప్పాడు. నిషేధ స‌మ‌యంలో ఫ్యామిలీ నుంచి మంచి స‌పోర్ట్ వ‌చ్చింద‌న్నారు. మాన‌సికంగా బ‌ల‌హీన‌ప‌డ్డ త‌న‌కు క్యాండిస్ శ‌క్తినిచ్చిన‌ట్లు వార్న‌ర్ చెప్పాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్ల‌కు త‌గ్గ‌ట్లుగా త‌న‌ను తీర్చిదిద్దింద‌న్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచ‌రీ కొట్టిన వార్న‌ర్ మ‌ళ్లీ గాడిలో ప‌డ్డాడు.1142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles