నా పేరుతో ఉన్న బార్లు, పబ్‌లతో నాకు సంబంధం లేదు!

Tue,February 5, 2019 06:07 PM

I have nothing to do with those bars and restaurants with my name in Delhi says Gambhir

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన పేరుతో నడుస్తున్న బార్లు, పబ్‌లపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నడుస్తున్న ఈ బార్లు, పబ్‌లతో తనకు ఎలాంటి సంబంధం లేదని గంభీర్ స్పష్టం చేశాడు. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ వీటితో నాకు సంబంధం లేదు.. అసలు ప్రపంచంలో ఎక్కడా నా పేరుతో ఎలాంటి బార్లు, పబ్‌లు లేవు అని గంభీర్ ట్వీట్ చేశాడు. ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో తన పేరుతో ఓ బార్ ప్రారంభం కావడంతో రెండేళ్ల కిందట కూడా గంభీర్ ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నాడు. దీంతో సదరు ఘుంగ్రూ బై గౌతమ్ గంభీర్ బార్ యజమానిని కోర్టుకు లాగాడు. తన అనుమతి లేకుండా తన పేరును వాడుకున్నాడని ఫిర్యాదు చేశాడు. అయితే ఆ పబ్‌ల ఓనర్ పేరు కూడా గౌతమ్ గంభీరే కావడం విశేషం. ఇదే విషయాన్ని అతడు కోర్టులో చెప్పాడు.


5152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles