అలాంటి వాళ్లుంటే.. ఫ్యామిలీతో ఎలా వెళ్తాం !

Sat,January 12, 2019 01:21 PM

I dont want Hardik Pandya, KL Rahul to be around my family, Says Harbhajan Singh

హైద‌రాబాద్: టెలివిజ‌న్ షోలో ఆడ‌వారిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసి.. వేటుకు గురైన ఇద్ద‌రు క్రికెటర్ల అంశంపై మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్‌సింగ్ స్పందించారు. పాండ్యా, రాహుల్‌పై వేటు వేసి బీసీసీఐ స‌రైన నిర్ణ‌యమే తీసుకుంద‌న్నారు. టీమ్ బ‌స్సులో త‌న కూతురు, భార్య ఉంటే, అలాంటిప్పుడు ఇలాంటి క్రికెట‌ర్ల‌తో ఎలా ప్ర‌యాణిస్తామ‌ని ట‌ర్బ‌నేట‌ర్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌ల‌ను ఒకే కోణంలో చూడ‌డం స‌రికాదు అని, ఫ్యామిలీ ఉన్న‌ప్పుడు ఇలాంటి వాళ్లను ఎంక‌రేజ్ చేయ‌లేమ‌ని భ‌జ్జీ తెలిపాడు. అస‌లు స్నేహితులతోనూ ఇలాంటి విష‌యాల‌ను మాట్లాడ‌మ‌ని, కానీ వాళ్లు టీవీ షోలో ప‌బ్లిక్‌గా మాట్లాడ‌డం స‌రికాదు అని హ‌ర్భ‌జ‌న్ అన్నాడు. టీవీల్లోనే ఇలా మాట్లాడితే, జ‌నం ఏం అనుకుంటారు, భ‌జ్జీ ఇలా చేశాడ‌మో, కుంబ్లే ఇలా చేశాడ‌మో, స‌చిన్ ఇలా చేశాడ‌మో అని అనుకోరా అని హ‌ర్భ‌జ‌న్ అభిప్రాయ‌ప‌డ్డాడు. జ‌ట్టులో పాండ్యా చాలా రోజుల నుంచి ఉన్నాడ‌ని, కానీ టీమ్ క‌ల్చ‌ర్ గురించి అత‌నికి తెలియ‌దా అని భ‌జ్జీ అన్నాడు. ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌కు స‌రైన శిక్ష విధించార‌ని స‌మ‌ర్థించాడు. టీవీ షోలో చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ప్ర‌స్తుతం బీసీసీఐ విచార‌ణ చేప‌డుతోంది. కానీ ఆసీస్ టూర్ నుంచి ఆ ఇద్ద‌ర్నీ అర్ధాంత‌రంగా వెన‌క్కి పంపించేశారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప్లేయ‌ర్ల‌కు తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని కెప్టెన్ కోహ్లీ కూడా త‌న అభిప్రాయాన్ని వినిపించారు.

2164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles