నా అవార్డును నబీకి అంకితమిస్తున్నా: రషీద్

Tue,September 10, 2019 03:02 PM

I dedicate my award to Nabi: Rashid

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ కీలకపాత్ర పోషించాడు. 11 వికెట్లతో పాటు ఓ అర్ధసెంచరీ చేసిన రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. నా ఈ అవార్డు మా సీనియర్ ప్లేయర్ మహమ్మద్ నబీకి అంకితమిస్తున్నానని అన్నాడు. అతడు మా జట్టు కోసం ఎంతో కష్టపడ్డాడు. జట్టు విజయవంతమవడంలో అతడి పాత్ర మరవలేనిది. అందుకే ఈ అవార్డు నబీకి అంకితమిస్తున్నా.. అని రషీద్ అన్నాడు.

కాగా, నబీ ఈ మ్యాచ్‌తో టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆడిన మూడు టెస్టుల్లో అతను ఆకట్టుకోలేదు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 33 పరుగులే చేశాడు. వన్డే, టీ-20 ఫార్మాట్స్‌లో నబీ రికార్డు చాలా బాగుంది. ఆఫ్ఘన్ తరఫున ఇప్పటివరకు నబీ 121 వన్డేలు, 67 టీ-20 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో రషీద్, నబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.

698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles