నేనేమీ అడుక్కోలేదు.. చీఫ్ సెలక్టర్‌పై నెహ్రా మండిపాటు!

Thu,November 2, 2017 06:14 PM

న్యూఢిల్లీ: తానెప్పుడూ ఫేర్‌వెల్ మ్యాచ్ కోసం ఎవరినీ అడుక్కోలేదని స్పష్టంచేశాడు ఆశిష్ నెహ్రా. సెలక్టర్ల అనుమతి లేకుండానే ఆట మొదలుపెట్టాను.. ఇప్పుడు వాళ్ల అనుమతి లేకుండానే ముగించాను అని అతను అన్నాడు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత నెహ్రాను ఎంపిక చేసే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని నెహ్రాతోపాటు టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ మధ్య కామెంట్ చేశాడు. దీనిపై నెహ్రా మండిపడ్డాడు. నేను కూడా ఇది విన్నాను. ఈ విషయంపై ఎమ్మెస్కే నాతో మాట్లాడినట్లు నాకు తెలియదు. నేను కేవలం టీమ్ మేనేజ్‌మెంట్‌తోనే చర్చించాను. రాంచీ వెళ్లగానే కోహ్లితో రిటైర్మెంట్ విషయం చెప్పాను. అతను ఐపీఎల్‌లో ఆడొచ్చుగా అని అడిగినా పూర్తిగా రిటైరవుతున్నట్లు చెప్పాను అని నెహ్రా స్పష్టంచేశాడు. నేను ఈ విషయాన్ని పదే పదే చెబుతూనే ఉన్నాను. నేనుప్పుడూ ఫేర్‌వెల్ గేమ్ అడగలేదు. ఢిల్లీలో మ్యాచ్ అదృష్టవశాత్తూ వచ్చిందే. గత ఎనిమిది, తొమ్మిదేళ్లు నేను పడ్డ కష్టానికి దేవుడు ఇలా కరుణించినట్లు నేను భావిస్తున్నా అని నెహ్రా అన్నాడు. రిటైర్మెంట్ విషయాన్ని కోహ్లి, రవిశాస్త్రిలతో మాత్రమే చెప్పానని, ఏ సెలక్టర్‌తో మాట్లాడలేదని నెహ్రా తెలిపాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20తో తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు నెహ్రా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

5467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles