ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఫెదరర్

Fri,January 26, 2018 03:33 PM

Hyeon Chung retired with hurt as Roger Federer through to the finals of Australian Open

మెల్‌బోర్న్‌ః డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సంచలన విజయాలతో ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు దూసుకొచ్చిన సౌత్ కొరియా సంచలనం హియోన్ చంగ్.. గాయంతో అర్ధంతరంగా తన జైత్రయాత్రను ముగించాడు. ఇవాళ ఫెదరర్‌తో జరిగిన సెమీస్‌లో రెండో సెట్ సందర్భంగా కాలికి గాయం కావడంతో అతను మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. తొలి సెట్‌ను 6-1తో గెలిచిన ఫెడెక్స్.. రెండో సెట్‌లోనూ 5-2తో లీడ్‌లో ఉన్న సమయంలో తప్పుకుంటున్నట్లు చంగ్ ప్రకటించాడు. అంతకుముందే అతను కాలి గాయానికి చికిత్స తీసుకున్నాడు. దీంతో మ్యాచ్ దాదాపు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. చికిత్స తర్వాత చంగ్ ఆడటానికి ఇబ్బంది పడ్డాడు. కాసేపటికే ఇక ఆడలేనంటూ తప్పుకున్నాడు. దీంతో డిఫెండింగ్ చాంపియన్ ఫెదరర్ మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఈ స్విస్ మాస్టర్.. 20వ టైటిల్‌పై కన్నేశాడు. ఫైనల్లోనూ గెలిస్తే ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన ఎమర్సన్, జొకోవిచ్‌ల సరసన ఫెదరర్ నిలుస్తాడు. మరోవైపు ప్రిక్వార్టర్స్‌లో ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్‌కు చెక్ పెట్టి మరీ సెమీస్ వరకూ వచ్చిన చంగ్ గ్రాండ్‌స్లామ్ కల.. గాయం కారణంగా అర్ధంతరంగా ముగిసింది.


1669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles