చెన్నైతో పోరుకు సన్‌రైజర్స్ కెప్టెన్ దూరం

Tue,April 23, 2019 05:37 PM

Hyderabad captain Kane Williamson to miss Chennai clash after grandmothers death

హైదరాబాద్‌:ఐపీఎల్‌-12లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరం కానున్నాడు. తన నాయనమ్మ మరణ వార్త తెలియగానే వెంటనే న్యూజిలాండ్‌ బయలుదేరి వెళ్లాడు. జైపూర్‌ వేదికగా ఈనెల 27న రాజస్థాన్‌ రాయల్స్‌తో పోరుకు అతడు అందుబాటులో ఉంటాడని సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. సీజన్‌లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. భుజం గాయం కారణంగా కేన్ దూర‌మైతే.. సీజన్‌ ఆరంభంలో టీమ్‌కు సారథిగా వ్యవహరించిన సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. అన్ని రంగాల్లో బలంగా ఉన్న చెన్నై టీమ్‌ను దాని సొంతగడ్డపై ఎదుర్కొనే సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిసున్న ఆటగాడు దూరం కావడం సన్‌రైజర్స్‌కు పెద్ద ఎదురుదెబ్బే. అయితే అతని స్థానంలో అఫ్గనిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ లేదా బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బ్యాటింగ్‌ విభాగంలో జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. విలియమ్సన్‌ గత నాలుగు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేశాడు. 14, 3, 3, 8* పరుగులతో ఇప్పటి వరకు ఒక్క గేమ్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అతడు లేని లోటు జట్టుపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకుల అంచనా.

9333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles