జడ్డూ బౌలింగ్.. ధావన్ బౌల్డ్: వీడియో

Sun,May 27, 2018 08:04 PM

Huge wicket for CSK

ముంబయి: వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తుదిపోరులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 13 వద్ద ఓపెనర్ శ్రీవాత్స్ గోస్వామి(5) రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టేందుకు సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

లుంగి ఎంగిడి వేసిన నాలుగో ఓవర్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండా మెయిడిన్ ఓవర్ వేశాడు. ఆచితూచి ఆడుతూ మధ్యమధ్యలో బౌండరీలు బాదుతున్న ఈ జోడీ భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కొద్దిసేపటికే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధావన్(26: 25 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ 73 పరుగులు చేసింది. విలియమ్సన్(37), షకిబ్ అల్ హసన్(6) క్రీజులో ఉన్నారు.

3590
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS