సచిన్‌లా అందరూ 16ఏళ్లకే విజయవంతం కాలేరు

Sun,March 11, 2018 02:44 PM

Hope Rishabh Pant is groomed properly unlike Parthiv Patel


న్యూఢిల్లీ: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెరీర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దాలని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు. భవిష్యత్‌లో భారత్ క్రికెట్ జట్టుకు అతడి అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్ తరహాలో పంత్ కెరీర్‌ను ఆగం చేయొద్దని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచిన్‌లా అందరూ 16ఏళ్లకే విజయవంతం కాలేరు. అతనొక క్రికెట్ మేధావి. పార్థీవ్‌ను చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అతడు అండర్-19 లెవల్ నుంచి నేరుగా భారత జట్టుకు ఆడాడు. సరైన అనుభవం లేక అంతర్జాతీయ క్రికెట్‌లో ఇబ్బంది పడుతున్నాడు. రిషబ్‌లో అపారమైన ప్రతిభ ఉంది. ఈ నేపథ్యంలో అతడిని సరిగ్గా తీర్చిదిద్దాలి. అప్పుడే అతను పార్థివ్‌లా అయ్యే అవకాశం తగ్గుతుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణించిన తరువాతనే జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని అన్నాడు. 2002లో పార్థీవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ధోనీ రాకతో పార్థీవ్‌తో పాటు దినేశ్ కార్తీక్ చాలా ఏళ్లపాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఐతే టెస్టులో వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్‌గా శాశ్వతంగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పోటీ పెరిగింది. అండర్-19 స్థాయిలో మంచి ప్రదర్శనతో కొద్దిరోజులుగా పంత్ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం లంకలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో పరుగులు సాధించడంలో రిషబ్ ఘోరంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే.

2594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS