దంచికొట్టిన విండీస్.. టీమిండియా టార్గెట్ 323

Sun,October 21, 2018 05:21 PM

Hetmeyer hits century as West Indies scored 322 runs in first ODI

గౌహతి: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. హెట్‌మెయిర్ సెంచరీ, ఓపెనర్ కీరన్ పావెల్ హాఫ్ సెంచరీ చేయడంతో 50 ఓవర్లలో 8 వికెట్లకు 322 పరుగులు చేసింది. కేవలం 78 బంతుల్లో 106 పరుగులు చేసిన హెట్‌మెయిర్.. విండీస్ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తప్ప మిగతా బౌలర్లందరూ ఆరుకుపైగా ఎకాన‌మీ రేట్‌తో పరుగులు ఇచ్చారు. పేస్ బౌలర్ల మహ్మద్ షమి తన పది ఓవర్లలో ఏకంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమేష్ యాదవ్, ఖలీల్ అహ్మద్ చెరో 64 పరుగులు, జడేజా 66 పరుగులు ఇచ్చారు. చాహల్ మాత్రమే పది ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కేదార్ జాదవ్‌లాంటి పార్ట్‌టైమ్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఐదుగురు బౌలర్లతోనే మొత్తం 50 ఓవర్లు పూర్తి చేయాల్సి వచ్చింది. మొదటి నుంచీ వెస్టిండీస్ రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోతూ ఉన్నా.. ఎక్కడా పరుగుల వేగం మాత్రం తగ్గలేదు. ఇన్నింగ్స్ అంతా దాదాపు ఆరుకుపైగానే పరుగులు సాధిస్తూ వచ్చింది.


2833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles