ధోనీ గ్యారేజ్.. ఇక్కడ అన్ని బైకులు పార్క్ చేయబడును!

Thu,August 16, 2018 06:43 AM

Have You Seen MS Dhonis Lavish Bike Museum?

మహేంద్ర సింగ్ ధోనీ కూల్ కెప్టెన్‌గా, సిన్సియర్ క్రికెటర్‌గా అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేశాడు. క్రికెట్ ఎంత ఇష్టమో, బైకులంటే అంతే ప్రాణం. ధోనికి పదుల సంఖ్యలో బైకులున్నాయి. కొత్తగా కొన్న హెలికాట్ ఎక్స్ 132 బైక్‌తో కలిపి మొత్తం తన గ్యారేజీలో 23 వెహికిల్స్ లున్నాయి. వాటినెక్కడ పెడుతాడో తెలుసా? పై చిత్రంలో మ్యూజియంలా కనిపిస్తున్న భవింతిలో.. ఈ ధోనీ గ్యారేజ్‌లో అన్ని బైకులు పార్క్ చేయబడును. వేరేవాళ్లవి కావు. అన్నీ అతనివే! ధోనికి బైక్స్ అంటే ఇష్ట‌మ‌ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సార్లయితే క్రికెట్ స్టేడియంలోనే బైక్ నడిపి సరదా తీర్చుకుంటాడు. చాలాసార్లు బైక్ వేసుకొని రాంచీ రోడ్లపైకి వచ్చేస్తాడు. తను కొన్నవి, బహుమతిగా వచ్చిన అన్ని బైకులను ఒక్కచోట చేర్చి ఒక మ్యూజియంలా ఏర్పాటు చేసుకున్నాడు.

ఈ విషయాన్ని ధోని భార్య సాక్షి ఈ అబ్బాయి తన బొమ్మలను చాలా ప్రేమిస్తాడు అని తన ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ చిత్రం సోషల్‌మీడియాలో టాక్ ఆఫ్ ద టాపిక్‌గా మారింది. బైకులు నడుపడమే కాదు మహీ వాటి రిపేర్ కూడా చేసుకుంటాడు. గతంలో వాటికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ వేదికలపై పెట్టుకున్నాడు. రైడింగ్స్, బైక్ ఫెస్టివల్స్‌లో పాల్గొని వాహన ప్రేమికుడినని చాటుకుంటున్నాడు. రకరకాల బైకులతో పాటు ధోని దగ్గర వింటేజ్ బండ్లు కూడా ఉన్నాయి.


Another pic from BFI

A post shared by M S Dhoni (@mahi7781) on

4357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles