ఆమ్లా ఔట్.. కష్టాల్లో సౌతాఫ్రికా

Wed,June 19, 2019 06:38 PM

Hashim Amla second fastest behind Virat Kohli to score 8000 ODI runs

బర్మింగ్‌హామ్: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా సీనియర్ ఓపెనర్ ఆమ్లా హాఫ్‌సెంచరీతో రాణించాడు. తక్కువ స్కోరుకే రెండు కీలక వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. చాలా నిదానంగా ఆడుతూ ఎట్టకేలకు అర్ధశతకం పూర్తి చేశాడు. 75 బంతుల్లో 4ఫోర్ల సాయంతో 50 మార్క్ అందుకున్నాడు. 176 ఇన్నింగ్స్‌లో ఆమ్లా వన్డేల్లో 8వేల పరుగులు పూర్తి చేశాడు.

వైవిధ్యమైన బంతులతో కివీస్ బౌలర్లు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. మ్యాట్ హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో సవాల్ విసురుతున్నాడు. తన తొలి 7 ఓవర్లలో రెండు మెయిడిన్ కాగా కేవలం 19 పరుగులే ఇచ్చాడు. సాంట్నర్ వేసిన 28వ ఓవర్లో ఆమ్లా బౌల్డ్ కావడంతో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. 31 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. మార్‌క్రమ్(33), వాన్‌డర్ డుస్సెన్(6) క్రీజులో ఉన్నారు.

2901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles