ఆఖరి పోరు.. మిథాలీ X కౌర్

Sat,May 11, 2019 05:18 PM

Harmanpreet Kaur vs Mithali Raj in final

జైపూర్: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ మిథాలీరాజ్ సారథ్యంలోని వెలాసిటీ, హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగే ఆఖ‌రి స‌మ‌రంలో ఈ రెండు జట్లు కప్ కోసం కదనరంగంలోకి దిగనున్నాయి. మహిళల టీ20 క్రికెట్‌కు మరింత ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో తొలిసారి ఐపీఎల్‌తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో అమ్మాయిలు అదరగొడుతున్నారు. తాము ఎందులో తీసిపోమంటూ అభిమానులకు పొట్టి ఫార్మాట్ మజాను అందిస్తున్నారు. కండ్లు చెదిరే సిక్స్‌లకు తోడు మెరుపు ఫీల్డింగ్‌తో మైమరిపిస్తున్నారు. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన టోర్నీలో విజేత ఎవరో ఇవాళ రాత్రి తేలనుంది.

స్టార్‌స్పోర్ట్స్‌లో రాత్రి 7.30 నుంచి..

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles