ఏషియాకప్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్

Thu,September 20, 2018 12:48 PM

Hardik Pandya out of Asia Cup after suffered a lower back injury

దుబాయ్: ఏషియాకప్‌లో పాకిస్థాన్‌పై సునాయాస విజయం సాధించి సెలబ్రేట్ చేసుకుంటున్న టీమిండియాకు ఇది ఒకరకంగా బ్యాడ్ న్యూసే. అదే పాక్‌తో వన్డే సందర్భంగా వెన్ను నొప్పితో మధ్యలోనే మైదానాన్ని వీడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఏషియాకప్ మొత్తానికీ దూరమయ్యాడు. అతని స్థానంలో పేస్ బౌలర్ దీపక్ చహర్‌ను టీమ్‌లోకి ఎంపిక చేయనున్నారు. గురువారమే అతడు యూఏఈలో ల్యాండవనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. పాక్‌తో మ్యాచ్ సందర్భంగా తన ఐదో ఓవర్ వేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. వెన్ను పట్టేయడంతో అతడు కదల్లేని స్థితిలో కనిపించాడు. దీంతో అతన్ని స్ట్రెచర్ సాయంతో బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడు లేచి నిలబడగలిగే పరిస్థితుల్లో ఉన్నా.. మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ పాండ్యాకు లేదని తేల్చారు.

3830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS