హార్దిక్ పాండ్యకు మరో షాక్..

Sat,January 12, 2019 05:06 PM

Hardik Pandya loses brand endorsement after sexist remarks on Koffee With Karan

ముంబయి: టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మరో షాక్. ఓ టీవీ ఛానెల్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడితో పాటు మరో ఆటగాడు కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరిని ప్రచారకర్తలుగా నియమించుకున్న పలు ప్రముఖ బ్రాండ్లు, సంస్థలు వాటి ఒప్పందాలను రద్దు చేసుకోవాలని భావిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో పాండ్య నిలకడగా రాణించడంతో అతనితో తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి కొన్ని కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలోనే జిల్లెట్ సంస్థ.. హార్దిక్‌తో కొన్ని నెలల క్రితం ఒప్పందం చేసుకుంది.

తాజాగా అతడు మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగడంతో అతనితో భాగస్వామ్యాన్ని తెంచుకున్నట్లు జిల్లెట్ ప్రకటించింది. జిల్లెట్ ప్రచారం నుంచి పాండ్యను తప్పిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. అతని వ్యాఖ్యలు గిల్లెట్‌పై ఎలాంటి ప్రభావం చూపవని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

6904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles