పాండ్యా, రాహుల్‌లపై సస్పెన్షన్ వేటు.. ఇండియాకు తిరుగు ప్రయాణం

Fri,January 11, 2019 05:24 PM

ముంబై: టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న వీళ్లిద్దరూ తిరిగి ఇండియాకు రానున్నారు. ఇద్దరిపైనా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ఇండియాకు తిరిగి వచ్చి వీళ్లు విచారణను ఎదుర్కోనున్నారు. మొదటి ఈ ఇద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని భావించినా.. చివరికి విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఇద్దరినీ ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పాండ్యా, రాహుల్‌లను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నాం అని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై నోరు పారేసుకున్న కారణంగా ఈ ఇద్దరిపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. తనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాన్ని తన పేరెంట్స్‌తోనూ చెప్పానని ఆ షోలో పాండ్యా చెప్పాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పటికే అతడు క్షమాపణ చెప్పినా.. అతని వివరణతో సీఓఏ సంతృప్తి చెందలేదు.

4611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles