నేను ఏడ్చానా.. ఎప్పుడు? ఎందుకు?

Sun,December 16, 2018 12:54 PM

Harbhajan Takes on Andrew Symonds broke down comments

ముంబై: ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌పై మరోసారి మండిపడ్డాడు టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్. పదేళ్ల కిందట సిడ్నీ టెస్ట్‌లో భాగంగా భజ్జీ తనను మంకీ అన్నాడంటూ సైమో ఆరోపించిన విషయం తెలుసు కదా. ఈ ఘటన తర్వాత మూడేళ్లకు తాము ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్‌లో కలిసి ఆడామని, అప్పుడు భజ్జీ తనకు క్షమాపణ చెప్పి ఏడ్చాడని సైమండ్స్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనిపై భజ్జీ సీరియస్‌గా రియాక్టయ్యాడు. ట్విటర్ వేదికగా స్పందించాడు. నేను ఏడ్చానా.. ఇది ఎప్పుడు జరిగింది? ఎందుకు? అంటూ ప్రశ్నించాడు.


2008లో టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్, సైమండ్స్ మధ్య వివాదం ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. భజ్జీ తనను మంకీ అన్నాడని, అవి జాతి వివక్ష ఆరోపణలే అని సైమండ్స్ ఫిర్యాదు చేయడంతో అప్పట్లో హర్భజన్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం కూడా విధించారు. ఆ తర్వాత టీమిండియా ఫైట్ చేయడంతో ఆ నిషేధాన్ని ఎత్తేశారు. ఆ తర్వాత మూడేళ్లకు భజ్జీ, సైమండ్స్ ముంబై ఇండియన్స్ టీమ్‌కు ఆడారు. ఆ సందర్భంగా టీమంతా ఓ పార్టీకి వెళ్లిన సమయంలో హర్భజన్ తన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాడని, కంటతడి కూడా పెట్టుకున్నాడని ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైమండ్స్ చెప్పాడు.

3816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles