వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేసిన భజ్జీ

Tue,February 12, 2019 01:11 PM

Harbhajan Singh selected World Cup Team for India

ముంబై: ఓవైపు వరల్డ్‌కప్‌కు వెళ్లే టీమిండియా ఎంపిక కోసం సెలక్టర్లు భారీ కసరత్తే చేస్తుంటే.. మరోవైపు వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ మాత్రం ఇప్పటికే 15 మంది సభ్యులతో టీమ్‌ను ప్రకటించేశాడు. అందులో దాదాపు అందరూ ఊహించిన పేర్లే ఉన్నాయి. ఈ మధ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్లలో ఆడిన టీమ్స్‌నే భజ్జీ ఎంపిక చేశాడు. అయితే ఆశ్చర్యకరంగా ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా పేర్లనూ అతడు టీమ్‌లో చేర్చాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలకు చాన్సిచ్చిన భజ్జీ.. ప్రాబబుల్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా పేరును ప్రకటించాడు. దీనికీ అతను ఓ బలమైన కారణం చెప్పాడు. ఇంగ్లండ్‌లో వాతావరణం చాలా వేడిగా, పొడిగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో జడేజా పనికొస్తాడని భజ్జీ తెలిపాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ గుర్తుండే ఉంటుంది. ఇంగ్లండ్‌లో చాలా వేడి, పొడి వాతావరణం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో జడేజా పనికొస్తాడు. ముఖ్యంగా ప్రత్యర్థి టీమ్‌లో ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉంటే జడేజా అవసరం. జడేజాను ఆరో నంబర్‌లో, పాండ్యాను ఏడో నంబర్‌లో ఆడించాలి. అంతేకాదు జడేజా మంచి ఫీల్డర్ కూడా అని హర్భజన్ చెప్పాడు.

భజ్జీ ఎంపిక చేసిన టీమ్ ఇదీ:

రోహిత్, ధావన్, కోహ్లి, రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, షమి, కార్తీక్, ఉమేష్ యాదవ్, విజయ్ శంకర్. ప్రాబబుల్: రవీంద్ర జడేజా

3400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles