ఆ ఘనత సాధించిన మూడో బౌలర్ భజ్జీ

Sat,May 11, 2019 03:23 PM

Harbhajan Singh becomes third Indian to take 150 wickets in IPL

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా భజ్జీ నిలిచాడు. సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో హర్భజన్ ఈ రికార్డు సృష్టించాడు. 150కి పైగా వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అమిత్ మిశ్రా(ఢిల్లీ), పియూశ్ చావ్లా(కోల్‌కతా) ఉన్నారు. మిశ్రా 147 మ్యాచ్‌ల్లో 157 వికెట్లు తీయగా.. చావ్లా 157 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు 148 వికెట్లతో ఉన్న భజ్జీ.. ఓపెనర్ శిఖర్ ధావన్, రూథర్‌ఫర్డ్‌ను ఔట్ చేసి ఫీట్ సాధించాడు.

2787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles