వార్నర్ ఔట్..మనీశ్ పాండే వీర‌విహారం

Tue,April 23, 2019 09:16 PM

చెన్నై: చెపాక్ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేస్తున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటింగ్ జోరుగా సాగుతోంది. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌(57), మ‌నీశ్ పాండే అర్ధ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. సీజ‌న్ ఆరంభం నుంచి వ‌రుస మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తున్న పాండే నేటి మ్యాచ్‌లో విజృంభించాడు. దూకుడుగా ఆడుతున్న వార్న‌ర్.. స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ బౌలింగ్‌లో జ‌ట్టు స్కోరు 120 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు. వేగంగా ఆడుతుండ‌టంతో స‌న్‌రైజ‌ర్స్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు హైదరాబాద్‌ 138 పరుగులు చేసింది. మనీశ్‌(65), విజయ్‌ శంకర్‌(13) క్రీజులో ఉన్నారు.

2975
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles