సచిన్ కొడుకు ఫొటోతో హాల్‌టికెట్

Thu,February 18, 2016 05:37 PM

Hall Ticket issued with Arjun Tendulkar's photo in UP


ఆగ్రా: ఇంటర్ బోర్డు అధికారులు ఓ విద్యార్థికి క్రికెట్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ ఫొటోతో ఉన్న హాల్‌టికెట్‌ను జారీ చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆగ్రాలోని రాజాబలవంత్ సింహ్ కాలేజీ సెంటర్ విద్యార్థులకు పరీక్షలకు ఒకే రోజు గడువుండగా ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.

పరీక్షకు ఒకరోజు ముందు హాల్‌టికెట్ తీసుకున్న అర్జున్‌సింగ్ అనే స్టూడెంట్ హాల్‌టికెట్‌పై అర్జున్ టెండూల్కర్ ఫొటో చూసి లబోదిబోమంటున్నాడు. ఉత్తరప్రదేశ్ ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్య వైఖరిపై విద్యానిపుణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

3035
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles