ఆస్ట్రేలియా టీమ్‌కు సారీ చెప్పిన అభిమానులుThu,October 12, 2017 12:41 PM

ఆస్ట్రేలియా టీమ్‌కు సారీ చెప్పిన అభిమానులు

గువాహటి: ఇండియాతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత ఆవేశం పట్టలేని కొందరు అభిమానులు.. ఆ టీమ్ బస్‌పై రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన రోజు రాత్రి హోటల్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై ఆసీస్ టీమ్ ఆందోళనకు గురైంది. దీనికంటే ముందు బంగ్లాదేశ్ టూర్‌లోనూ ఆస్ట్రేలియా టీమ్ బస్‌పైనే రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రత్యర్థి టీమ్‌పై దాడి తమకు చెడ్డ పేరు తెస్తుందని భావించిన గువాహటిలోని కొందరు అభిమానులు.. హుందాగా ప్రవర్తించారు. ఆసీస్ టీమ్‌కు వీడ్కోలు పలుకుతున్న సమయంలో హోటల్ బయట నిల్చొని క్షమించమని ప్లకార్లులు పట్టుకున్నారు. ఇది మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడా ఇలా స్టేడియాల్లో నిరసనలు, బస్సులపై దాడులు జరగడం సహజమే అయినా.. ఎవరో కొందరు చేసిన పొరపాటుకు అందరినీ తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ ఇలా సారీ చెప్పడం మాత్రం చాలా అరుదైన ఘటనే.
5110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS