వెళ్లి మీ పాక్‌లో సెల‌బ్రేట్ చేసుకో.. పో..!Mon,June 19, 2017 11:07 AM

వెళ్లి మీ పాక్‌లో సెల‌బ్రేట్ చేసుకో.. పో..!

న్యూఢిల్లీ: క‌శ్మీర్ వేర్పాటువాది మిర్వేజ్ ఫ‌రూక్‌పై సీరియ‌స్ అయ్యాడు క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్‌. పాకిస్థాన్ గెలిస్తే.. వెళ్లి ఆ దేశంలోనే సెల‌బ్రేట్ చేసుకో అంటూ గౌతీ ట్వీట్ చేశాడు. పాక్ గెలవ‌గానే ఎటు చూసినా ప‌టాకుల మోత‌తో ఈద్ ముందే వ‌చ్చిన‌ట్లుంది.. పాక్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు అంటూ ఫ‌రూక్ ట్వీట్ చేశాడు.


దీనికి గంభీర్ కాస్త వెట‌కారంగా స్పందించాడు. ఫ‌రూక్.. నీకో స‌ల‌హా. మీరు స‌రిహ‌ద్దు క్రాస్ చేస్తే ఇంకా మంచి ప‌టాకులు (చైనీస్‌) దొరుకుతాయి. అక్క‌డే ఈద్ సెల‌బ్రేట్ చేసుకో. ప్యాకింగ్‌లో మీకు నేను సాయం చేస్తా అని గంభీర్ ట్వీట్ చేశాడు.
సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన త‌ర్వాత కూడా ఫ‌రూక్ పాక్ టీమ్‌ను ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో గంభీర్ ఇక ఏమాత్రం కామ్‌గా ఉండలేక‌పోయాడు. గ‌తంలోనూ క‌శ్మీర్ ఆందోళ‌న‌కారులపై, వేర్పాటువాదుల‌పై ట్వీట్స్ చేశాడు.

15665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS