మేమెక్కడ క్రికెట్ ఆడుతున్నా.. ఓటు వేసే అవకాశం ఇవ్వండి!

Mon,March 25, 2019 04:37 PM

Give us a chance to vote anywhere in India asks Ravichandran Ashwin to PM Modi

న్యూఢిల్లీ: ప్రస్తుతం క్రికెటర్లంతా ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్‌లో భాగంగా వాళ్లు దేశంలోని వివిధ నగరాలు తిరగాల్సి ఉంటుంది. ఇదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. వివిధ రాష్ర్టాల్లో మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే తమ రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగే సమయంలో ఓ క్రికెటర్ అక్కడే ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తన సొంత ఊరిలోనే ఓటు వేయాలి. దీంతో తాము ఓటు వేసే అవకాశం కోల్పోతామని కింగ్స్ పంజాబ్ కెప్టెన్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అందువల్ల తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని తమకు నచ్చిన నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. అదే సమయంలో తమకు ఈ వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరాడు.
2364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles