సౌతాఫ్రికాకు చేదువార్త‌.. కేశ‌వ్‌కు గాయం

Sun,October 13, 2019 07:29 PM

పుణె: భారత్‌ చేతిలో టెస్టు సిరీస్‌ను చేజార్చుకొని నిరాశలో ఉన్న సఫారీలకు మరో ఎదురుదెబ్బ. భారత్‌తో తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత సంతతి ఆటగాడు, సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌కు గాయమైంది. కేశవ్‌కు గాయం కావడం సఫారీలకు చేదువార్తే. అటు బంతితో కన్నా బ్యాట్‌తోనే స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాడు కేశ‌వ్‌. పుణె టెస్టు రెండో రోజు ఆటలో ఫీల్డింగ్‌ చేస్తుండగా కేశవ్‌ కుడి భుజానికి గాయమైంది. నొప్పితోనే బ్యాటింగ్‌ చేస్తూ కెరీర్‌లో తొలి అర్ధశతకం సాధించాడు. నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆటకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో కేశవ్‌ స్థానంలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జార్జ్‌ లిండేను రాంచీ టెస్టుకు ఎంపిక చేశారు. సిరీస్‌లో ఆఖరిదైన మూడో టెస్టు అక్టోబర్‌ 19న రాంచిలో ప్రారంభమవుతుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది.

1774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles