అఫ్రిదికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన గంభీర్

Tue,April 3, 2018 06:29 PM

Gautham Gambhir strongly reacts over Afridis comments on Kashmir

న్యూఢిల్లీ: గౌతమ్ గంభీర్.. మిగతా క్రికెటర్లతో పోలిస్తే కాస్త దేశభక్తి పాళ్లు ఎక్కువే. సరిహద్దులో పాక్ దుశ్చర్యలపై అతడు తరచూ స్పందిస్తూనే ఉంటాడు. పాకిస్థాన్ అంటేనే ఓ రకమైన ఏహ్యభావం గంభీర్‌కు ఉంది. తాజాగా పాక్ క్రికెటర్ అఫ్రిది కశ్మీర్ అంశంపై ట్వీట్ చేసిన విషయం తెలిసిందే కదా. దీనిపై గంభీర్ స్పందించాడు. అతనికి గట్టి పంచే ఇచ్చాడు. అఫ్రిది ట్వీట్‌పై నన్ను స్పందించాల్సిందిగా మీడియా అడిగింది. దీనిపై ఏం స్పందించాలి? అఫ్రిది యూఎన్ స్పందించాలంటున్నాడు. బుద్ధిమాంద్యం ఉన్న అతని దృష్టిలో యూఎన్ అంటే అండర్ నైన్టీన్ అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌కు ఔట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అని గంభీర్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. మొన్న కశ్మీర్‌లో భారత బలగాలు 13 మంది టెర్రరిస్టులను మట్టుబెడితే.. ఇండియా ఆక్రమిత కశ్మీర్‌లో అమాయకులను అణచివేస్తున్నారంటూ అఫ్రిది ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.


5276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles