ఆ జెర్సీ నెంబర్‌కి రిటైర్మెంట్ ప్రకటించాలి..!

Mon,June 10, 2019 05:40 PM

Gautam Gambhir lead wishes as cricket fraternity pays tribute to Yuvraj?Singh

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో సుధీర్ఘ కాలం కొనసాగి రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ శుభాభినందనలు తెలిపాడు. భారత క్రికెట్లో వన్డేల్లో అద్భుతంగా రాణించిన క్రికెటర్లలో యువీ ఒకడని ప్రశంసించాడు. యువరాజ్ గొప్ప కెరీర్‌కు నివాళిగా అతడు ధరించిన జెర్సీ నంబర్ 12కు బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశాడు. ఛాంపియన్(యువీ) లాగా బ్యాటింగ్ చేయాలనే కోరిక తనకు ఉండేదని గంభీర్ ట్విటర్లో పేర్కొన్నాడు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో చాలా మంది క్రికెట‌ర్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌తో ఉన్న సాన్నిహ‌త్యాన్ని, అనుబంధాన్ని ఫొటోల‌తో త‌మ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

4205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles