కోచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోకి దూరి మరీ సంబురాలు.. వీడియో

Mon,July 16, 2018 12:39 PM

France players invaded Coach Deschamps press conference to celebrate

మాస్కో: రెండోసారి సాకర్ వరల్డ్‌కప్ గెలిచిన ఫ్రాన్స్ ఆటగాళ్ల సంబురాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఫైనల్లో క్రొయేషియాపై 4-2తో గెలిచి వరల్డ్‌కప్ గెలిచిన ఫ్రాన్స్ ప్లేయర్స్.. రాత్రంతా సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ తర్వాత కోచ్ దిదియర్ డెస్‌చాంప్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుంటే.. అందులోకి కూడా చొరబడ్డారు. షాంపేన్ వర్షం కురిపిస్తూ కోచ్‌ను మీడియాతో మాట్లాడనీయలేదు. మొదటగా డిఫెండర్ బెంజమిన్ మెండీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోకి దూసుకొచ్చాడు. తన షర్ట్ విప్పి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మిగతా టీమంతా అతన్ని ఫాలో అయింది. 1998 వరల్డ్‌కప్ గెలిచిన టైమ్‌లో ఆ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న డెస్‌చాంప్స్.. ఇప్పుడు కోచ్‌గా మరోసారి ట్రోఫీని ముద్దాడాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్లేయర్స్ వచ్చి సంబురాలు చేసుకుంటుంటే.. వాళ్లను ఏమాత్రం అడ్డుకోకపోగా తాను కూడా వాళ్లతో కలిసిపోయాడు.
1386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles