ఫిఫా ప్రపంచకప్‌..ఫైనల్ కు చేరిన ఫ్రాన్స్

Wed,July 11, 2018 12:05 PM

France entered final in fifa World cup

సెయింట్ పీటర్స్‌బర్గ్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం అర్ధరాత్రి బెల్జియంతో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. సమవుజ్జీల సమరంగా భావించిన సెమీస్ మ్యాచ్‌లో ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడ్డాయి. మ్యాచ్ 51వ నిమిషంలో ఉమిట్టి కొట్టిన హెడర్ నేరుగా బెల్జియం గోల్ పోస్ట్‌ను ఛేదించడంతో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. కార్నర్ నుంచి స్టార్ ైస్ట్రెకర్ అంటోనీ గ్రిజ్‌మన్ కొట్టిన బంతిని డిఫెండర్ ఉమిట్టి గోల్‌గా మలిచాడు.

బెల్జియం గోల్‌కీపర్ తియబత్ కౌర్టియోస్‌ను ఏమారుస్తూ ఉమిట్టి కొట్టిన హెడర్‌గా మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ తర్వాత బెల్జియం ప్రతిదాడులకు పూనుకున్నప్పటికీ లాభం లేకపోయింది. బంతిని 60శాతం తమ ఆధీనంలో ఉంచుకున్నా పటిష్ఠమైన ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదించడంలో రెడ్ డెవిల్స్ విఫలమైంది. పలుమార్లు గోల్ కోసం ప్రయత్నించినా అదృష్టం కలిసిరాలేదు. ఫైనల్ చేరడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికను ఎంచుకున్న ఫ్రెంచ్ జట్టు మటౌడీని తీసుకుని ఫ్రాన్స్ తమ మిడ్‌ఫీల్డ్‌ను బలోపేతం చేసుకోగా, డెంబెలీ రాకతో బెల్జియం మరింత పటిష్ఠంగా తయారైంది.

1045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles