ఉరుగ్వేకు షాక్.. సెమీ ఫైన‌ల్లో ఫ్రాన్స్

Fri,July 6, 2018 09:34 PM

France beat Uruguay 2-0 to enter semi-finals

నిజ్ని నొవొగార్డో(రష్యా): మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్-ఉరుగ్వే మధ్య జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాళ్లు అదరగొట్టారు. పటిష్ఠ ఉరుగ్వే డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ ఫ్రాన్స్ అలవోకగా గోల్స్ చేసింది. ఆధిపత్యం ప్రదర్శించిన ఫ్రాన్స్ 2-0తో ఉరుగ్వేపై ఘన విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించింది. స్టార్లతో నిండిన ఉరుగ్వే కీలకపోరులో సత్తాచాటలేకపోయింది.

ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆరంభం నుంచి రసవత్తరంగా సాగింది. బంతిని ఫ్రాన్స్ డిఫెండర్లు ఎక్కువ సేపు తమ నియంత్రణలో ఉంచుకున్నారు. అయితే ఉరుగ్వేనే ఎక్కవ సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా గోల్ చేయలేకపోయింది. ప్రథమార్ధంలో గోల్ కష్టమనే అనుకున్నారంతా.. కానీ తొలి సెషన్ ఆఖర్లో 40వ నిమిషంలో రాఫెల్ వరెన్ హెడర్‌గోల్‌తో ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ద్వితీయార్ధంలోనూ ఫ్రాన్స్ అలవోకగా గోల్ సాధించింది. 61వ నిమిషంలో స్టార్ స్ట్రెకర్ గ్రిజ్‌మన్ నేరుగా తన్నిన బంతి ఉరుగ్వే గోల్‌కీపర్ చేతిలో పడింది. చాలా వేగంగా వచ్చిన బంతిని ఆడ్డుకునే ప్రయత్నంలో చేతిని తాకిన బంతి గాల్లోకి ఎగిరి నేరుగా గోల్‌పోస్టులో పడింది. దీంతో ఫ్రాన్స్ 2-0తో ఆధిక్యాన్ని మెరుగుపరచుకుంది. ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నించే క్రమంలో మైదానంలోనే వాగ్వివాదానికి దిగారు. రిఫరీలు కలగజేసుకొని ఆటగాళ్లకు సర్దిచెప్పారు. ఫ్రాన్స్ రెండో గోల్ చేయడంతోనే ఉరుగ్వే అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంజురీ సమయంలోనూ ఎవరూ గోల్ చేయకపోవడంతో ఫ్రాన్స్ 2-0తో మ్యాచ్ ముగించింది.

1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles