సాకర్ సమరం..నాకౌట్‌కు ఫ్రాన్స్

Thu,June 21, 2018 10:48 PM

  France beat Peru 1-0 to enter pre-quarters

ఎకటెరిన్‌బర్గ్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ అదరగొట్టింది. వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రూప్-సీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0 స్కోరుతో పెరూను ఓడించింది. ఈ గ్రూప్‌లో ఫ్రాన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్-సీ నుంచి వరల్డ్‌కప్ నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన పెరూ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.

ఆరంభం నుంచి ఇరు జట్లు బంతిని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు, గోల్‌పోస్ట్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. బలమైన ఫ్రాన్స్‌ను ఎదుర్కోవడం పెరూకూ ఇబ్బందిగా మారింది. 34వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కైలియాన్ బప్పే గోల్ కొట్టి ఫ్రాన్స్‌ను ఆధిక్యంలో నిలిపాడు. రెండో సెషన్‌లో స్కోరును సమం చేసేందుకు పెరూ ఆటగాళ్లు చెమడోడ్చారు. కానీ ఫ్రాన్స్ డిఫెండర్లను దాటి వారు ముందుకెళ్లలేకపోయారు. సెకండ్ సెషన్‌లో ఎవరూ గోల్ చేయకపోవడంతో ఫ్రాన్స్ 1-0తో గెలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది.

680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles