వ్యభిచార గృహాలకు వెళ్లిన నలుగురు అథ్లెట్లపై వేటు

Mon,August 20, 2018 02:51 PM

జకర్తా: వ్యభిచార గృహాలకు వెళ్లిన నలుగురు బాస్కెట్‌బాల్ ప్లేయర్లపై జపాన్ వేటు వేసింది. ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన జపాన్ ప్లేయర్లు.. సమీపంలో ఉన్న ఓ రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లారు. జాతీయ దుస్తులను ధరించిన ఆ ప్లేయర్లు వ్యభిచార గృహాల వద్ద సంచరించినట్లు తెలిసింది. దీంతో జపాన్ ఒలింపిక్ కమిటీ ఆ నలుగురు బాస్కెట్‌బాల్ ప్లేయర్లపై చర్యలు తీసుకున్నది. వెంటను వాళ్లను స్వదేశానికి పంపించింది. ఈ ఘటన పట్ల క్షమాపణలు కూడా చెప్పింది ఆ దేశ ఒలింపిక్ కమిటీ. 2014లోనూ ఓ జర్నలిస్టు కెమెరాను ఎత్తుకెళ్లిన సందర్భంలో జపాన్ ఒలింపిక్ సంఘం అప్పుడో స్మిమ్మర్‌ను ఇలాగే ఇంటికి పంపించింది. బాస్కెట్‌బాల్ ప్లేయర్ల వ్యభిచార గృహాలకు వెళ్లడం సిగ్గుచేటు చర్య అని జపాన్ అధికారి ఒకరు తెలిపారు.

4898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles