మాజీ క్రికెట‌ర్‌పై గూండాల‌ దాడి

Mon,February 11, 2019 05:35 PM

Former India pacer Amit Bhandari assaulted at Delhi team training ground

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేస్ బౌల‌ర్ అమిత్ భండారీని ఢిల్లీలో గూండాలు చిత‌క‌బాదారు. ప్ర‌స్తుతం అమిత్ ఢిల్లీ క్రికెట్ సంఘంలో సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్నాడు. సెయింట్ స్టీఫెన్స్ గ్రౌండ్ వ‌ద్ద ఢిల్లీ సీనియ‌ర్ జ‌ట్టు శిక్ష‌ణ పొందుతున్న స‌మ‌యంలో.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అమిత్‌పై దాడి చేశారు. ఆ దాడిలో అమిత్ త‌ల‌కు, చెవుల‌కు తీవ్ర‌గాయ‌మైంది. ప్ర‌స్తుతం అమిత్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతున్నాడు. అండ‌ర్ 23 జ‌ట్టు కోసం సెల‌క్ష‌న్స్ జ‌రుగుతున్నాయి. అయితే ఓ ప్లేయ‌ర్‌ను ఆ టీమ్‌కు ఎంపిక చేయాల‌ని అమిత్‌పై వ‌త్తిడి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు గూండాలు అమిత్‌ను కొట్టిన‌ట్లు తెలుస్తోంది.

1753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles