క్రికెట్‌లో రిజర్వేషన్లా.. కైఫ్ సీరియస్!

Sun,July 29, 2018 05:03 PM

Former Cricketer Mohammed Kaif slams a website for calling reservations in Cricket

లక్నో: దేశంలో రిజర్వేషన్ వ్యవస్థపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా క్రికెట్‌లో రిజర్వేషన్లు ఉండాలంటూ ది వైర్ అనే వెబ్‌సైట్ పెద్ద ఆర్టికల్‌ను ప్రచురించింది. సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లో బ్లాక్స్‌కు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇండియన్ టీమ్‌లోనూ అలాగే ఉండాలని ఆ కథనంలో ది వైర్ చెప్పింది. ఇండియాకు టెస్ట్ హోదా వచ్చి 86 ఏళ్లు అవుతుంది. మొత్తం 290 మంది ఆడగా.. అందులో కేవలం నలుగురు మాత్రమే ఎస్సీ, ఎస్టీకి చెందిన ప్లేయర్స్ ఉన్నారు అంటూ ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. దీనిపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ ఆర్టికల్‌పై ట్విటర్‌లో స్పందిస్తూ.. మీడియాలో ఎంత మంది ప్రముఖ జర్నలిస్టులు లేదా ఎడిటర్లు ఎస్సీ, ఎస్టీకి చెందినవాళ్లు ఉన్నారు. దేశంలో కుల వ్యవస్థను విజయవంతంగా అధిగమించిన ఘనత ఒక్క క్రీడలకే దక్కుతుంది. ప్లేయర్స్ అంతా ఒక్కటిగా ఆడతారు. కానీ ఇలాంటి జర్నలిజం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నది అని కైఫ్ ట్వీట్ చేశాడు.ఇంతకుముందు కేంద్ర రామ్‌దాస్ అథవాలే కూడా క్రికెట్‌లో రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. వివిధ టోర్నీలకు ఎంపికయ్యే ప్లేయర్స్‌లో అగ్రవర్ణాల వాళ్లే ఉన్నారు. ఇది ఆగాల్సిందే. వెనుకబడిన వర్గాలవాళ్లలోనూ సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్లకు సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది జూనియర్ లెవల్‌కే పరిమితమవుతున్నారు తప్ప.. టెస్టు లేదా వన్డే స్థాయికి చేరలేకపోతున్నారు అని అథవాలే అన్నారు. అయితే క్రికెట్‌లో రిజర్వేషన్లను మాత్రం ప్లేయర్స్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఓ ఐపీఎస్ ఆఫీసర్ టీమ్‌లో ఎంతమంది ముస్లిం ప్లేయర్స్ ఉన్నారని అడిగినందుకు హర్భజన్‌సింగ్ అతనికి క్లాస్ పీకాడు.

3265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles