కోహ్లి రిసెప్షన్‌కు కుంబ్లే వచ్చాడు!

Wed,December 27, 2017 01:50 PM

Former Coach Anil Kumble attends Virat Kohlis Reception

ముంబైః ఇందులో పెద్ద విశేషం ఏముంది అని కొట్టి పారేయొద్దు. మరొక్కసారి చదవండి.. నిజంగానే టీమిండియా కెప్టెన్ కోహ్లి రిసెప్షన్‌కు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే వచ్చాడు. పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత విభేదాలు ఓ దశలో ఈ ఇద్దరి మధ్య ఉన్న విషయం తెలిసిందే. అవమానకర రీతిలో కుంబ్లేను కోచ్ పదవి నుంచి తప్పించడంలో కోహ్లిదే కీలకపాత్ర. కనీసం అతని బర్త్ డే నాడు కూడా విరాట్ విష్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు కోహ్లి పిలవగానే కుంబ్లే అవన్నీ మరచిపోయి రిసెప్షన్‌కు రావడం విశేషం. ఈ విషయాన్ని ఓ అభిమాని ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు. కుంబ్లే ఒక్కడే రాకుండా తన భార్య చేతనను కూడా తీసుకొని ముంబైలో జరిగిన ఈ రిసెప్షన్‌కు రావడం చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయినట్లేనా అన్న చర్చ కూడా మొదలైంది.


3847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS