సెంచరీ కొట్టకుండానే పెవిలియన్ చేరిన ఫించ్.. వార్నర్@50

Wed,June 12, 2019 04:48 PM

finch out and Warner hits 50 runs

సెంచరీ దిశగా అడుగేసిన ఫించ్.. సెంచరీ చేస్తాడని ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులంతా భావించినప్పటికీ.. తన దూకుడుకు అడ్డుకట్ట పడింది. 23వ ఓవర్ ఫస్ట్ బాల్‌కే భారీ షాట్ కొట్టి.. హాఫీజ్ చేతికి ఫించ్ చిక్కాడు. ఆమిర్ బౌలింగ్‌లో ఫించ్ పెవిలియన్ బాట పట్టాడు. 84 బంతుల్లో 82 పరుగులు చేసి ఫించ్ ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు.

మరోవైపు ఓపెనర్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. 22వ ఓవర్‌లో చివరి బాల్‌లో ఫోర్ కొట్టి వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 23 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి ఆసీస్ 149 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్, స్మిత్ ఉన్నారు.
3016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles