హాఫ్ సెంచరీ కొట్టి పెవిలియన్ చేరిన ఫించ్

Thu,June 20, 2019 04:47 PM

Finch out

ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, ఫించ్ ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యంతో ఆడి ఆస్ట్రేలియాకు భారీ స్కోర్ అందించారు. ముందుగా వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా.. 20 వ ఓవర్‌లో ఫించ్ 50 పరుగులు చేశాడు. అయితే.. సౌమ్య సర్కార్ బౌలింగ్ లో ఫించ్ ఔట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. రుబెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి ఉస్మాన్ ఖవాజా వచ్చాడు.

మొత్తం 51 బంతుల్లో ఫించ్ 53 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. 85 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఖవాజా 12 బంతుల్లో 6 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్, ఖవాజా ఉన్నారు. 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి ఆస్ట్రేలియా 132 పరుగులు చేసింది.




1502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles