ఒక వేళ బౌండరీలు కూడా సమానమైతే..?

Mon,July 15, 2019 03:32 PM

Final Ends in Tie, Super-Over Ends in Tie, More Boundaries Give England World Cup

లండన్: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఒత్తిడిని అధిగమించిన ఇంగ్లాండ్ విశ్వ‌విజేత‌గా నిలిచింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన ఫైన‌ల్‌పోరు తొలుత టై అయింది. సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై కావ‌డంతో సూపర్ ఓవర్‌తో కలిపి మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించడం వల్ల ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ 26(23ఫోర్లు, 3సిక్సర్లు).. న్యూజిలాండ్ 17(14ఫోర్లు, 3సిక్సర్లు) కొట్టింది. సూపర్ ఓవర్ టై అయితే ప్రధాన మ్యాచ్, సూపర్ ఓవర్‌లో నమోదైన మొత్తం బౌండరీలను లెక్కించి ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటించారు. ఒకవేళ బౌండరీలు కూడా టై అయితే ఏం చేస్తారు? అని మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియాలో చర్చకు లేవనెత్తారు.

సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం ఎలా తేల్చాలన్న దానిపై కూడా ఐసీసీ నిబంధనలు రూపొందించింది. అది ఎలాగంటే సూపర్ ఓవర్ నియమావళి ప్రకారం ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సూపర్ ఓవర్ బౌండరీలను మినహాయించి.. కేవలం ప్రధాన మ్యాచ్ బౌండరీలను మాత్రమే లెక్కిస్తారు. ఒకవేళ ఆ సంఖ్య కూడా సమానమైతే సూపర్ ఓవర్ చివరి బంతి నుంచి ఇరు జట్లు సాధించిన రన్స్‌ను పరిగణలోకి తీసుకొని, ఎక్కువ పరుగులు చేసిన జట్టును విజేతగా నిర్ణయిస్తారు.

ఉదాహరణకు ఫస్ట్ టీమ్.. త‌మ సూప‌ర్ ఓవ‌ర్ 6వ బంతికి 2 పరుగులు, సెకండ్ టీమ్ కూడా 6వ బంతికి 2 పరుగులు చేస్తే వీటిని పరిగణనలోకి తీసుకోరు. తర్వాతి ఐదో బంతికి ఫస్ట్ టీమ్ 4 పరుగులు.. సెకండ్ టీమ్ 3 పరుగులు చేసిందనుకోండి. ఈ పరిస్థితిలో సెకండ్ టీమ్ కన్నా ఫస్ట్ టీమ్ ఒక పరుగు ఎక్కువ చేయడం వల్ల సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం తొలి జట్టునే విజేతగా ప్రకటిస్తారు.

3336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles