ఇక ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో 48 టీమ్స్

Tue,January 10, 2017 03:52 PM

హైద‌రాబాద్: ఫిఫా వ‌రల్డ్ క‌ప్ పోటీలు ఇక నుంచి కొత్త ఫార్మాట్ల‌లో జ‌ర‌గ‌నున్నాయి. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌ట్ల సంఖ్య‌ను పెంచ‌నున్న‌ట్లు ఫిఫా ఇవాళ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పోటీప‌డే 32 జ‌ట్ల సంఖ్య‌ను 48కి పెంచ‌నున్న‌ట్లు ఫిఫా పేర్కొంది. 2026 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఈ ఫార్మాట్‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఫిఫా స్ప‌ష్టం చేసింది. 1998 నుంచి ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను 32 జ‌ట్ల‌తో నిర్వ‌హిస్తున్నారు.


4474

More News