గుహలో చిన్నారులు.. ఫిఫా ఫైనల్‌కు రండి!

Fri,July 6, 2018 08:47 PM

Fifa president invites boys trapped in Thai cave to attend World Cup Final

మాస్కో: యువ ఫుట్‌బాల్ జట్టుతో పాటు ఆ టీమ్ కోచ్ ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్‌లోని గుహను చూసేందుకు వెళ్లి అందులో చిక్కుకున్న విషయం తెలిసిందే. జూన్ 23 నుంచి ఆయువ జట్టుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాజం నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. తాజాగా ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో కూడా గుహలో చిక్కుకుపోయిన చిన్నారులు సురక్షితంగా బయటకు పడాలని.. వారు క్షేమంగా వచ్చి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడాలని ఆకాంక్షించారు.

చిన్నారులు క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నామని గియానీ తాజాగా థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చీఫ్‌కు లేఖ రాశారు. పిల్లలంతా సురక్షితంగా బయటకు వచ్చి జులై 15న మాస్కోలో జరగనున్న ఫైనల్ సాకర్ సమరాన్ని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే చిన్నారులు వారి కుటుంబంతో కలవాలని ఆశిస్తున్నాను. గుహలో నుంచి బయటపడేందుకు వారికి ఆరోగ్యం సహకరించాలని కోరుకుంటున్నా. 2018 ప్రపంచకప్ ఫైనల్‌కు చిన్నారులందరినీ తమ అతిథులుగా ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని లేఖలో వెల్లడించారు.

2276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles