రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

Sun,June 16, 2019 06:35 PM

Fewest innings to 11000 ODI runs

మాంచెస్టర్: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరులో టీమిండియా సార‌థి, ర‌న్ మెషీన్‌ విరాట్ కోహ్లీ మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. వ‌న్డేల్లో అత్యంత‌ వేగంగా 11వేల ప‌రుగులు పూర్తి చేసిన తొలి క్రికెట‌ర్‌గా విరాట్ నిలిచాడు. పాక్‌తో మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 57 ప‌రుగులు పూర్తి చేయ‌డంతో ఈ ఘ‌న‌త అందుకున్నాడు. 276 ఇన్నింగ్స్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉన్న రికార్డును తాజాగా కోహ్లీ అధిగ‌మించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ప్ర‌త్యర్థి బౌల‌ర్ల‌ను బెంబేలెత్తిస్తూ విరాట్ సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తున్నాడు.

11,000 ప‌రుగుల వీరులు..

1.విరాట్ కోహ్లీ(222 ఇన్నింగ్స్‌లు)
2.స‌చిన్ టెండూల్క‌ర్‌(276 ఇన్నింగ్స్‌లు)
3.రికీ పాంటింగ్‌(286 ఇన్నింగ్స్‌లు)
4.సౌర‌భ్ గంగూలీ(288 ఇన్నింగ్స్‌లు)
5.జాక్వెస్ క‌లీస్‌(293 ఇన్నింగ్స్‌లు)4219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles