పాండ్యా, రాహుల్ వివాదంపై కరణ్ రియాక్షన్ ఇదీ!

Wed,January 23, 2019 01:13 PM

Feel responsible but it is beyond my control says Karan Johar on Pandya and Rahul controversy

ముంబై: టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని సస్పెన్షన్‌కు గురైన విషయం తెలుసు కదా. ఆ షోలో మహిళలపై నోరు జారి ఈ ఇద్దరు క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. అయితే దీనికంతటికీ కారణమైన ఆ షో హోస్ట్ కరణ్ జోహార్ మొత్తానికి ఈ వివాదంపై స్పందించాడు. వాళ్లకీ పరిస్థితి రావడానికి తానే బాధ్యుడినని, అయితే ప్రస్తుతం ఆ అంశం తన నియంత్రణలో లేదని కరణ్ అన్నాడు. వాళ్లు నా షోలో ఉన్నారు కాబట్టి దానికి బాధ్యుడిని నేనే. వాళ్లను నేనే అతిథులుగా ఆహ్వానించాను. ఆ షోలో ఏం జరిగినా నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

వాళ్లకు జరిగిన నష్టం చూసి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలా అని ఆలోచించాను. కానీ నా మాట వినేవాళ్లు ఎవరు? ప్రస్తుతం ఆ అంశం నా నియంత్రణలో లేదు అని కరణ్ జోహార్ అన్నాడు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఈ ఇద్దరు క్రికెటర్లపై నిరవధికంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో వీళ్లు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌తోపాటు ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్‌కు కూడా దూరమయ్యారు. ఇప్పటికే వీళ్లు బేషరతు క్షమాపణలు చెప్పినా.. సీఓఏ మాత్రం కరుణించలేదు. విచారణ పూర్తయ్యేంత వరకు వీళ్లపై సస్పెన్షన్ కొనసాగనుంది.

2828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles