ధోనీతో చెప్పులు తొడిగించుకుంటావా.. ఎంత ధైర్యం?

Mon,December 17, 2018 01:13 PM

రాంచీ: పైన ఉన్న ఫొటో చూశారా? టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఎవరికో చెప్పులు తొడుగుతున్న ఫొటో అది. ఆ చెప్పులు తొడిగించుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు.. అతని భార్య సాక్షి ధోనీయే. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. షూ నువ్వే ఇప్పించావు.. వాటిని నువ్వే తొడగాలి అంటూ సాక్షి ఓ క్యాప్షన్ పెట్టింది. అయితే ఇది ధోనీ అభిమానులకు నచ్చలేదు. మా ధోనీతోనే చెప్పులు తొడిగించుకుంటావా అంటూ సాక్షిపై ధోనీ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. ఏదో మొగుడు పెళ్లాల మధ్య సరదాగా జరిగిన ఘటనను కూడా అభిమానులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నువ్వు కెప్టెన్‌వి, సర్వెంట్‌వి కాదు అని ఒకరు.. అంత మంచి మనిషితో ఇంత దారుణంగా వ్యవహరిస్తావా అని మరొకరు.. బక్వాస్ పిక్ అని ఇంకొకరు సాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి సాక్షి మరో ఫొటోతో రిైప్లె ఇచ్చింది. ఈసారి ధోనీ తనకు బ్రేస్‌లెట్ తొడుగుతున్న ఫొటో పెట్టి.. ఇది నువ్వే ఇప్పించావు.. నువ్వే తొడగాలి అంటూ అలాగే మరో క్యాప్షన్ పెట్టింది.

7654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles