గెలిచిన ఆనందంలో రణరంగం సృష్టించిన ఫ్యాన్స్: వీడియో

Wed,July 11, 2018 03:50 PM

Fans clash with police while celebrating Frances World Cup semifinal win

పారీస్: ఫిఫా సమరంలో మంగళవారం రాత్రి తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ పోరులో ఫ్రాన్స్ 1-0 గోల్ తేడాతో బెల్జియంపై గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. 2006 త‌రువాత ఫ్రాన్స్ ఫైన‌ల్ చేర‌డం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ రాజధాని పారీస్‌లో అభిమానులంతా వీధుల్లోని రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. నృత్యాలు చేస్తూ, కేరింతలూ కొడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించడంతో సంబరాలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఫ్యాన్స్ రోడ్లపై ఏర్పాటు చేసిన భారీకేడ్లను ఎత్తి పక్కకు పడేయడం, పోలీసులపై వాటర్ బాటిల్స్, రాళ్లు రువ్వడం చేశారు. దీంతో పోలీసు, పారామిలటరీ బలగాలు అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నాయి.

ఈ సంబరాలు కాస్త అభిమానులు, పోలీసులకు మధ్య రణంగా మారింది. స్థానికులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వారికి మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పోలీసుల వైపు పలు వస్తువులు విసురుతుండటంతో లాఠీ ఛార్జీ కూడా చేశారు. జనాల గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. ఈ తొక్కిసలాటలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

2162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles