మొన్న కోహ్లీకి.. నిన్న రోహిత్‌కు అభిమాని ముద్దు:వీడియో

Mon,October 15, 2018 04:23 PM

Fan tries to kiss Rohit Sharma during Mumbais Vijay Hazare Trophy

హైదరాబాద్‌: ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని ఒకరు మైదానంలో దూసుకొచ్చి అతనికి ముద్దు ఇవ్వబోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి అనుభవమే హిట్‌మ్యాన్ రోహిత్ శర్శకు ఎదురైంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో ముంబయి తరఫున రోహిత్ శర్మ ఆడుతున్నాడు. బిహార్ జట్టు నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబయి ఛేదనను ప్రారంభించింది. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొని వచ్చి రోహిత్ శర్మకు కిస్ ఇవ్వబోయాడు. ఈ క్రమంలోనే రోహిత్ పాదాలను కూడా తాకబోయాడు. అనంతరం అభిమాని అమితానందంతో మళ్లీ తన స్థానానికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
4163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles