లైవ్‌లో రిపోర్టర్ ముఖంపై బీరు పోశాడు..: వీడియో వైర‌ల్‌

Thu,July 12, 2018 07:48 PM

Fan throws beer at journalists face while reporting World Cup match

మాస్కో: ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అభిమానులు వింతవింత చేష్టలతో అలరిస్తుంటారు. అభిమానులు గొడవ పడటం, నిరసన తెలపడం, బహిరంగంగానే రొమాన్స్ చేసుకోవడం, గ్యాలరీలను పాడుచేయడం, మ్యాచ్ ముగిసిన తరువాత వాటిని శుభ్రం చేయడం ఇలాంటి సన్నివేశాలు చాలాసార్లు చోటుచేసుకుంటాయి. భావోద్వేగానికి లోనైన ఓ అభిమాని న్యూస్ రిపోర్టర్‌పై బీరు పోశాడు.

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఇంగ్లాండ్, క్రోయేషియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ పోరు రసవత్తరంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 2-1తేడాతో గెలిచిన క్రోయేషియా ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఉత్కంఠపోరును తమ ఛానెల్‌లో లైవ్ రిపోర్టింగ్ చేయాలనుకున్న ఒక జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ ఆఖర్లో అక్కడి విశేషాలను న్యూజిలాండ్ రిపోర్టర్ లాయిడ్ బర్ ది ఏమ్ షో ఛానెల్ తరఫున లైవ్‌లో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి అతని ముఖంపై బీరు పోశాడు. అయినప్పటికీ తన ఏకాగ్రత కోల్పోకుండా రిపోర్టింగ్ కొనసాగించాడు. బీరు పోసిన వ్యక్తి మధ్యలో మరోసారి వచ్చి అసభ్యకరంగా మాట్లాడటం కూడా చేశాడు. ఈ ఘటనలో తనతో పాటు వచ్చిన కెమెరామెన్ సురక్షితంగానే బయటకు వచ్చామని లాయిడ్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. మద్యం సేవించి తనపై దాడికి పాల్పడింది ఆస్ట్రేలియా వ్యక్తి అని వెల్లడించాడు.


3349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS