సచిన్‌ మొదటి సెంచరీ చేసింది ఈ రోజే..

Wed,August 14, 2019 02:58 PM

exactly this day sachins scored maiden century

ముంబయి: లిటిల్‌ మాస్టర్‌, రికార్డుల రారాజు సచిన్‌ టెండూల్కర్‌ మొదటి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసింది ఈ రోజే(ఆగస్టు14,1990). సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో 17 సంవత్సరాల సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌ సెంచరీ(119)తో ఇండియాను పోటీలో నిలబెట్టాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 16 సంవత్సరాల చిరుప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్‌ ఎన్నో రికార్డుల తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ సచిన్‌. అలాగే అన్ని ఫార్మాట్లలో 34,000పైగా పరుగులు. అత్యధిక వన్డే, టెస్టు మ్యాచ్‌లాడిన క్రికెటర్‌ సచినే కావడం గమనార్హం.

గ్రాహం గూచ్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేయగా, ఇండియా 408పరుగులు చేసింది. ఇందులో సచిన్‌ అర్ధసెంచరీ(68) కూడా ఉంది. 87పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లాండ్‌ 320పరుగులకు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఇండియాకు 408పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

సచిన్‌ ఒంటరి పోరాటం.. సహచరుల అభినందనలు...
408 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 110పరుగులకే టాపార్డర్‌ వికెట్లను చేజార్చుకుంది. కానీ, ఒక్కడు మాత్రం ఇంగ్లాండ్‌కు పరీక్ష పెట్టాడు. ఓపిగ్గా ఆడిన సచిన్‌ 17 బౌండరీల సాయంతో 119పరుగులు చేశాడు. దీంతో, ఒక్కసారిగా స్టేడియమంతా చప్పట్లతో మార్మోగింది. సహచర ఆటగాళ్లు సైతం సచిన్‌ను అభినందించారు.

1625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles